Articles About Athirathram Yaga:

Click on links

"అతిరాత్రం"   ఎన్నెన్నొ విశిష్టతల సమ్మేళనం. వేద-ఇతిహాస-పురాణాల్లో ప్రస్తావింపబడిన  ఈ మహాయాగాల నిర్వహణలవలన  ప్రకృతి- పర్యావరణముల  పరిరక్షణ,  అణువణువు ఛేదించి మృగత్వంతో మానవులు చేసే ప్రకృతి వినాశనానికి విరుగుడుగా సనాతన భారతీయ వేద విజ్ఞానంద్వారా  కణము-కణము కలిపి ప్రకృతిలో జవజీవాలను నింపి, జీవద్రవ్యాన్ని పెంచటానికి కష్టతరమైన ప్రక్రియతో గూడిన మహామంత్ర నివేదనతో  చేసే మహొన్నత ప్రయోగం "అతిరాత్రం".

KHS Seva Trust నిర్వహణలో,  16 స్మార్త యాగములతోపాటు 2012లో భద్రాచలంలో అతిరాత్రం ఉత్కృష్ట సోమయాగమును, 2013లో మురమళ్ల (తూ.గో.జిల్లా) లో అతిరుద్రం మహాయాగము, 2015లో కర్నూలులో అప్తోర్యామం మహాసోమయాగము, మహాసౌరం మహాయాగము మరియు 2017లో యాదాద్రి (యాదగిరిగుట్ట, తెలంగాణ)లో 126 రోజులపాటు శ్రీపంచాయతన సహిత అయుత శ్రీమహావిష్ణు మహాయాగం ఇత్యాది 21మహాయాగములను నిర్వహించి విశేష బహుయజ్ఞకర్తగా పేరుగాంచిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మగారి పర్యవేక్షణలో 2018 ఏప్రిల్ 14 నుండి 2018 ఏప్రిల్ 27 వరకు 14రోజులు తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం-సామర్లకోట టి.జంక్షన్ వద్ద, పాండవులమెట్ట దిగువన, సువిశాల ప్రాంగణంలో అతిరాత్రం – మహాగ్నిచయన పూర్వక శ్రౌతసోమయాగము మరియు పుత్రకామేష్టి, శ్రీప్రత్యంగిరా విశ్వశాంతి మహాయాగములు జరుగనున్నవి.

 లోకకల్యాణం, పర్యావరణ పరిరక్షణ, విపత్తులనివారణ, ముఖ్యంగా మానవ సమాజంలో అన్ని జాతులు, మతాలు, కులాలు, వర్గాల మధ్య పరస్పర సద్భావన, సౌభ్రాతృత్వాలను నెలకొల్పాలన్న పరమ లక్ష్యంతో ఈ మహాయాగములను తలపెట్టారు. గతంలో ఈ యాగకర్తలే భద్రాచలంలో నిర్వహించిన అతిరాత్రమహాయాగ పరిశోధన ఫలితాలు లోకవిదితమే.
 
ఈ మహాసోమయాగమును కర్నాటక, శివమొగ్గ, మత్తూరు అగ్రహారానికి చెందిన నిత్యాగ్నిహోత్రులు బ్రహ్మశ్రీ కిరణ అవధాని  సోమయాజి దంపతుల యజమానత్వంలో, బ్రహ్మశ్రీ కేశవ అవధాని గారి ఆధ్వర్యవంలో భారతదేశమునందు కల వివిధ రాష్ట్రములకు చెందిన, సుమారు 70మంది చతుర్వేద (ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు) శ్రౌతపండితులతో  భారతదేశంలో అత్యంత అరుదుగా నిర్వహించడం విశేషముగా చెప్పవచ్చు.

          అలాగే దశరథమహారాజు, శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, సమస్త భూమండలాన్నీ పరిపాలించిన భారత చక్రవర్తులు, ఆచరించిన మహాయాగం అతిరాత్రం. విషతుల్యమౌతున్న  భూమి- నీరు- ప్రాణవాయువులను అగ్నిహోత్రంద్వారా శుద్ధపరిచే ప్రకృతి చికిత్స; విశ్వశాంతికై ఆచరిస్తున్న అత్యంత ప్రాచీన మహోత్కృష్ట సోమయాగం అతిరాత్రం. ఇది శాస్త్రీయముగా నిరూపితమైన విషయము.

ప్రకృతి పరిరక్షణతోపాటు, మానవులకు,  నిత్యఅవసరములైన ఆరోగ్యము, ఆయుష్షు, ఉన్నత విద్య,  ఉద్యోగము, సకాల వివాహము, సంతానము,  దంపతుల అన్యోన్యత, విదేశయానము, వ్యాపార అభివృద్ధి, ప్రమాద నివారణ వంటి కోరికలు తీరునిమిత్తం ప్రత్యంగిరాహోమమును మరియు సంత్సంతాన నిమిత్తము పుత్రకామేష్టి మహాయాగముల నిర్వహించనున్నారు.  2018 ఏప్రిల్ 27 మహాశాంతిహోమం, మహా పూర్ణాహుతితో ఈ మహాయాగములు పూర్తవుతాయి.
      
సుమారు 10వేలమంది సందర్శకులు సౌకర్యంగా కూర్చుని ఈ ఆధ్యాత్మిక మహాక్రతువులను తిలకించేందుకు తగిన వసతులు (కుర్చీలు, టి.వి.లు, మంచినీరు....) ఏర్పాటవుతున్నాయి. ప్రతినిత్యం ఉదయం 50,000 మందికి, రాత్రి 5,000 మందికి ఉచిత మహాన్నప్రసాదం (అన్నసమారాధన) అందిచాలన్న సంకల్పంతో సువిశాల భోజనశాల నిర్మాణం, అత్యవసర వైద్యసదుపాయం, అంబులెన్స్, అగ్నిమాపక దళం, పోలీస్ రక్షణ, స్త్రీ – పురుషులకు విడివిడిగా స్నాన, శౌచాలయాల నిర్మాణం వంటి ఏర్పాట్లు జరుగనున్నాయి.
         
సందర్శకులకోసం రేయింబవళ్ళు శ్రమించే కార్యకర్తల బృందం సన్నద్ధమౌతోంది. KHS Seva Trust ముఖ్య సలహాదారు శ్రీ కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మగారి నేతృత్వంలో ఈ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గురువులు, ప్రముఖులు, పండితులు, ఆధ్యాత్మిక సంపన్నులు, పాలకులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు.

          పావన పాండవులమెట్ట, పెద్దాపురం నందు జరగనున్న ఈ మహోన్నత మహాక్రతువులకు యధోచితంగా సహకరించి, ప్రత్యక్షంగా సందర్శించి, మహాప్రసాదాన్నిస్వీకరించి లోకకల్యాణ క్రతువులో భాగస్వాములు కావలసినదిగా KHS Seva Trust భక్తవరేణ్యులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నది.                                                               

 
కార్య నిర్వాహక వర్గం,                                                                                                KHS Seva Trust


Download

E- Brouchure (E)

ఈ "అతిరాత్రం" ఎన్నెన్నొ విశిష్టతల సమ్మేళనం. వేద-ఇతిహాస-పురాణాల్లో ప్రస్తావింపబడిన ఈ మహాయాగాల నిర్వహణలవలన ప్రకృతి- పర్యావరణముల పరిరక్షణ, అణువణువు ఛేదించి మృగత్వంతో మానవులు చేసే ప్రకృతి వినాశనానికి విరుగుడుగా సనాతన భారతీయ వేద విజ్ఞానంద్వారా కణము-కణము కలిపి ప్రకృతిలో జవజీవాలను నింపి, జీవద్రవ్యాన్ని పెంచటానికి కష్టతరమైన ప్రక్రియతో గూడిన మహామంత్ర నివేదనతో చేసే మహొన్నత ప్రయోగం "అతిరాత్రం"

Watch Our Previous

Mahayaga's here

Click on Links

​​ATHIRATHRAM/ అతిరాత్రం 

 Click on Below Links:

​Our Previous Yaga's: